కేసీఆర్ వెంటే తెలంగాణ సమాజం:నిరంజన్‌రెడ్డి

293
niranjanreddy

తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెంటే ఉందని మరోసారి నిరూపితమైందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్‌కు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టినందకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి…ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని పదే పదే రుజువవుతున్నా విపక్షాలు తమ వికృతచేష్టలు మానుకోవడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మీద అబద్దాలు ప్రచారం చేసి ప్రజల దృష్టి మరల్చి లాభపడాలనుకున్న వారి ప్రయత్నాలకు ప్రజలు ఎప్పటికప్పుడు బుద్ది చెబుతున్నారని చెప్పారు. ఇప్పటికైన విపక్షాలు బుద్ది తెచ్చుకుని బంగారు తెలంగాణలో భాగం కావాలన్నారు.