కాంగ్రెస్‌ కంచుకోటకు బీటలు…కేటీఆర్‌కు విషెస్‌

352
ktr ajay

కాంగ్రెస్ కంచుకోట హుజుర్‌నగర్‌లో కారు జోరుకు ఎదురులేకుండా పోయింది. కౌంటింగ్ మొదలైనప్పటీ నుంచి టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సైదిరెడ్డి 24 వేల ఓట్ల ఆధిక్యంలో ఉండగా మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ గెలుపుతో గులాబీ నేతల సంబరాలు అంబరాన్నంటగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ గెలుపులో కీరోల్ పోషించిన కేటీఆర్‌ను కలిసి విషెస్ చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్‌.

హుజూర్‌నగర్ ఓట్ల లెక్కింపు ఫలితాలు ఏకపక్షంగా సాగుతుండటంతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి. ఇక బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఎదురయ్యింది.

ktr ajay