చిల్లర రాజకీయాలు మానుకోవాలి: నిరంజన్ రెడ్డి

85
Niranjan Reddy
- Advertisement -

రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయం మానుకోవాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన 600 మంది పంజాబ్, యూపీ, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల రైతు కుటుంబాలకు చేస్తున్న సాయంపై విపక్షాల విమర్శలను ఖండించారు. తెలంగాణలో నేటి వరకు 80,755 రైతు కుటుంబాలకు రైతుభీమా అందించామన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి భీమా లేదన్నారు. రైతుభీమాతో వ్యవసాయ కుటుంబాలకు ధీమా లభించిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు చేస్తున్న రూ.3 లక్షల సాయంపై కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర రాజకీయాలు అన్నారు. అసలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి పథకం అమలు చేసే దమ్ముందా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.50 వేల సాయం అందాలంటే ఎక్కని గడప, మొక్కని నాయకుడు ఉండేది కాదని…తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాత నిర్ణయాల మూలంగా రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల సాయం పది రోజులలో ఎలాంటి పైరవీలు, కమిటీలు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు కుటుంబాలకు అందుతుందన్నారు.

ప్రభుత్వమే రైతులకు ప్రీమియం చెల్లించి అమలుచేస్తున్న గొప్ప పథకం ఇది అని తెలిపిన నిరంజన్ రెడ్డి…రైతుభీమా అందుకున్న రైతులందరివీ ఆత్మహత్యలని ప్రచారం చేస్తున్న దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ అన్నారు. రైతు డిక్లరేషన్లు కాదు ముందు మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో వాటిని ఈ ఏడాది నుండి అమలుచేసి చూపాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం అంటే గొర్రె కసాయివాడిని నమ్మినట్లే .. దశాబ్దాల కాంగ్రెస్ పాలన చూసి విసుగుచెంది ప్రజలు ఆ పార్టీని పక్కనపెట్టారన్నారు.

- Advertisement -