స్వరాష్ట్రంలో మెరుగుపడ్డ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ..

131
minister-niranjan-reddy-
- Advertisement -

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దేశంలో అత్యధిక పరిశ్రమలు వచ్చాయని, వాటితో గ్రామీణ వ్యవస్థ ముఖ చిత్రం మారిపోయిందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ రాష్ట్రంలోని ఆగ్రో రైతుసేవా కేంద్రాల నిర్వహకులకు అగ్రి క్లినిక్, అగ్రి బిజినెస్‌లో మేనేజ్ సంస్థ సహకారంతో ఆగ్రోస్ నిర్వహిస్తున్న 45 రోజుల ప్రత్యేక శిక్షణ తొలి విడత శిబిరాన్ని ఆగ్రోస్‌ ఎండీ రాములు, మేనేజ్‌ ప్రిన్సిపల్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌ఎస్‌ పండ్‌, మేనేజ్‌ డీజీ చంద్రశేఖరతో కలిసి మంత్రి ప్రారంభించారు.

భవిష్యత్‌ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదేనని, ఏ రంగంలో ఇంత పెద్ద ఎత్తున ఉపాధి లేదన్నారు. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే వారికి ఉపాధి కల్పించాలన్నారు. రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో వివిధరంగాలలో వినూత్న మార్పులు తీసుకువచ్చారని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పారిశ్రామీకరణ పెరిగిందని, 15లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు. కరెంటు సౌకర్యం లేక సమైక్యపాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని, ఆరు లక్షల మంది ఉపాధి కోల్పోయారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ దుస్థితి నుంచి బయటపడ్డామన్నారు. ఆధునిక ప్రపంచంలో మనం ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయని, లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత మానసిక ధైర్యంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.

- Advertisement -