విద్యార్థి నాయకుడికి టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు: ఎన్నారై తెరాస

205

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్ ప్రస్థుత విద్యార్థి విభాగం (TRSV) రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ గారు ఖరారు చేసిన సందర్భంగా ఎన్నారై తెరాస యూకే అధ్యక్షులు అశోక్ దుసారి మాట్లాడుతూ కెసిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంలో అశోక్ దుసారి మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో, ధీక్షతో పనిచేస్తున్నారని, ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెల్లారని గుర్తుచేశారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సిఎం కెసిఆర్ గారు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి తెరాస పార్టీ ఎల్లప్పుడు ఉద్యమకారులను ప్రోత్సహిస్తుందని మరొక్కసారి రుజువైనదని తెలిపారు.

ఎన్నారై తెరాస ఇప్పటికే అటు సోషల్ మీడియాలో మరియు ఎన్నారై తెరాస యూకే నాయకులు క్షేత్రస్థాయిలో తెరాస గెలుపు కొరకు హజూరాబాద్ లో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే, అలాగే ఎన్నారై తెరాస ప్రత్యేక కార్యాచరణతో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని, తెరాస ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తెరాస అభ్యర్థి గెలుపుకు కృషిచేస్తామని అశోక్ తెలిపారు.

ఈ సందర్భంలో అశోక్ మాట్లాడుతూ ఎన్నారై తెరాస పక్షాన, ఎన్నారైల పక్షాన కెసిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపుకు ప్రతిఒక్కరు కృషిచెయ్యాలని కోరారు.