గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం: హరీష్‌ రావు

178
harishrao
- Advertisement -

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి హరీష్‌ రావు. ఇల్లంతకుంట ప్రజా ఆశీర్వాద సభ లో మాట్లాడిన మంత్రి హరీష్ రావు …సీఎం గారి ఆశీస్తులతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయం….ప్రజలు‌ కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం….తెరాస గెలిస్తే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందన్నారు.

ఈటల‌ గెలిస్తే ఏం చేస్తారో అడగండి…ఆయన నన్ను చూసి ఓట్లు వేయమని అడుగుతున్నాడు….ఆత్మగౌరవం అని మాట్లాడుతూ ఆత్మ వంచన చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.లెఫ్టిజం అని చెప్పుకుంటూ…రైటిజంలో చేరారు….బీజేపీలో చేరి ఆత్మ వంచన చేసుకున్నారు.పోటీ తెరాస , బీజేపీల మధ్యే…. కాంగ్రెస్ పోటీలో లేదు.బీజేపీ, ఈటల గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలన్నారు. ప్రజలకు లాభమోంటో చెప్పాలి.మంత్రిగా పనులు చేయని రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఏం చేస్తారని ప్రశ్నించారు.మేం రైతు బీమా, రైతు బంధు, ఆసరా , కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, దళిత‌బంధు ఇస్తాం….బీజేపీ గెలిస్తే ఏం చేస్తారో ఆలోచించాలన్నారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ప్రభుత్వ‌రంగ‌ సంస్థలను ప్రయివేటీకరిస్తోంది…. ఉద్యోగులను తొలగిస్తోంది.పెట్రోల్, డిజీల్, గ్యాస్‌ధరలను పెంచి‌ పేద ప్రజల‌నడ్జి విరుస్తోందన్నారు.ఆసరా పెన్షన్ ఇచ్చే కేసీఆర్ ‌కావాలా…ధరలు పెంచే బీజేపీ‌కావాలా.అరవై రూపాయల డిజీల్‌ను 104 రూ కు పెంచి రైతులపై భారం వేస్తోంది బీజేపీ ప్రభుత్వం…ఎకరానికి‌ ఐదు వేల‌ రూపాయల రైతు బంధు కేసీఆర్ ఇస్తుంటే‌. ..గతంలో‌ఎకరం లో‌ట్రాక్టర్ పనికి 3 వేలు ఖర్చయ్యేవి. డిజీల్ ధరలు పెంచడంతో ఇప్పుడు ఎకరానికి ఐదు వేలు ఖర్చవుతోందన్నారు.

ఎంపీగా బండి‌సంజయ్ గెలిచి‌ రెండేళ్లయింది… ఏ గ్రామంలో అభివృద్ధి పనుల‌కోసం అయినా పది లక్షలు ఖర్చు చేశారా..వ్యక్తి కోసం‌ కాకుండా మీ ప్రాంత భవిషత్తు కోసం ఆలోచించండన్నారు.కాళ్సేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్నది హుజూరాబాద్ ప్రజలు…అసలు ఎమ్మెల్యే ‌గా ఈటల‌రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారు…కేవలం నీ స్వార్థం‌కోసమే రాజీనామా చేశావ్ కదా అని ప్రశ్నించారు.

రెండు‌కుంటల భూమి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు , రెండు వందల‌ ఎకరాల ఆసామి ఈటలకు మధ్య పోటీ‌..ఉద్యమ నేత, తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి గెల్లు అని తెలిపారు.పది కోట్లతో రామాలయం అభివృద్ధి చేసుకుందాం.…హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత కేసీఆర్ ఆశీస్సులతో‌నేను తీసుకుంటా అని తెలిపారు.

- Advertisement -