సుప్రీం తీర్పు..రైతుల విజయం: మంత్రి నిరంజన్ రెడ్డి

265
niranjan reddy
- Advertisement -

కేంద్ర వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రైతులు సాధించిన పాక్షిక విజయం అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేంద్ర వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే నేపథ్యంలో స్పందించిన నిరంజన్ రెడ్డి… రైతుల ఆందోళనలు గమనించిన సుప్రీం నిన్న కేంద్రాన్ని రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపాలని ఆదేశించిందన్నారు.

పరిష్కారం మీరు చూపుతారా ? మమ్మల్ని జోక్యం చేసికోమంటరా ? అని ప్రశ్నించిందని తెలిపిన నిరంజన్ రెడ్డి… కేంద్రం తీరును పరిశీలించిన సుప్రీం ఈ రోజు కేంద్ర వ్యవసాయ చట్టాలపై స్టే విధించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ చట్టాలపై సమీక్షకు నిపుణుల కమిటీ వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్టు అన్నారు.

సుప్రీం నిపుణుల కమిటీలో రైతుసంఘాలు , కేంద్రమే కాకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పించాలని సుప్రీంను అర్థిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలను మీడియా దాచిపెడుతుందన్నారు. కేంద్రం విధానాలను దేశంలో ఎవరు ప్రశ్నించినా, నిలదీసినా మీడియా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ చట్టాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో తప్పనిసరై తప్పించుకునే పరిస్థితి లేక మీడియా వార్తలు ప్రచురించిందన్నారు. సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ అన్ని రాష్ట్రాల అభ్యర్థనలు స్వీకరిస్తే ప్రజాస్వామ్యబద్ద పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం అన్నారు.

- Advertisement -