స్వామి వివేకానంద..తేజోమూర్తి: ఎర్రబెల్లి

15
errabelli

స్వామి వివేకానంద చైతన్య తేజోమూర్తి అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించిన ఎర్రబెల్లి…స్వామి వివేకానంద చైతన్య మూర్తి..యువతకు స్ఫూర్తి అన్నారు.

నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. వివేకానంద బోధనలు విశ్వవ్యాప్తంగా పేరుగాంచాయి. ఆయన సూక్తులు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి అని మంత్రి చెప్పారు.