కౌలు రైతులకు రైతుబంధు వర్తించదు: నిరంజన్ రెడ్డి

223
niranjan reddy
- Advertisement -

కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తించదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్బంగా రైతు బంధు పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన నిరంజన్ రెడ్డి…రాష్ర్టంలోని కౌలుదారుల‌కు రైతుబంధు ఇవ్వ‌డం కుద‌రదు. ఇదే విష‌యాన్ని సీఎం కేసీఆర్ అనేక సంద‌ర్భాల్లో గుర్తు చేశార‌ని చెప్పారు.

రైతు బంధు ప‌థ‌కాన్ని ఏ రాష్ర్టం కూడా అమ‌లు చేయ‌డం లేదు. ఈ ప‌థ‌కం కేసీఆర్ మాన‌స‌పుత్రిక అన్నారు. కొవిడ్ కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌వ‌సాయ రంగాన్ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కింద చేర్చి.. రైతాంగానికి రైతుబంధు ఇచ్చామ‌న్నారు. భూమి య‌జ‌మానికే అది కూడా సీసీఎల్ఏ ద్వారా ప‌ట్ట‌దారు పాసుపుస్త‌కం పొందిన వారికే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌న్నారు.

2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 12 వేల కోట్లు, 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 12 వేల కోట్లు, 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 14 వేల కోట్లు కేటాయించిన‌ట్లు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తెలిపారు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత వ్య‌వ‌సాయాన్ని అభివృద్ధి చేయాల‌నే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ప్ర‌తి 5 వేల ఎక‌రాల‌కు ఒక అగ్రిక‌ల్చ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ను నియ‌మించామ‌ని చెప్పారు. రైతు బీమా ప్రీమియం కోసం రూ. 2,917 కోట్ల 39 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశామన్నారు.

- Advertisement -