నాగబాబుకు కరోనా పాజిటివ్…

187
nagababu

మెగాబ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన నాగబాబు త్వరగా కరోనాను జయించి ఫ్లాస్మా దానం చేస్తానని తెలిపారు. కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా నాగబాబు సూచించారు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు,సినీ నిర్మాతలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. లెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం,కీరవాణి వంటి వారు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పనిచేసే వారికి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.