సుదర్శన్‌రావు మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం..

131
ktr

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు , పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూకట్‌పల్లికి చెందిన యం. సుదర్శన్ రావు ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కే తారకరామారావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీకి తొలి రోజుల నుంచి పనిచేసిన వ్యక్తి సుదర్శన్ రావు అని, ఆయనతో తనకు వ్యక్తిగతంగా సుమారు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని కేటీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేటియార్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.