త్వరలో టాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నారు మంత్రి మల్లారెడ్డి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించగా ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి…కరోనా తర్వాత ఓటీటీకి ఆదరణ పెరిగిందన్నారు. తాను కూడా మెగాస్టార్ చిరంజీవి భాగస్వామ్యంతో ఓటీటీలో సినిమాలను నిర్మిస్తానని చెప్పారు.
అన్నా నీతో ఒక్క ఫోటో దిగుతా అంటూ చమత్కరించిన మల్లారెడ్డి..తెలుగు సినీరంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు తెలంగాణ వ్యక్తేనని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రా వ్యక్తి కాదని.. తెలంగాణ బిడ్డేనని పేర్కొన్నారు.తెలుగు సినీరంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు తెలంగాణ వ్యక్తేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రా వ్యక్తి కాదని.. తెలంగాణ బిడ్డేనని పేర్కొన్నారు. కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరూ గొప్పోళ్లు కావొచ్చని, చిరంజీవి లాంటి వ్యక్తుల జీవితమే దానికి నిదర్శమన్నారు.
అన్నా నేను నీ అభిమానిని. నేను నీ అంత ఫేమస్ కాదన్నా.. నువ్వు కేంద్రమంత్రివి కూడా అయ్యావు . మీ ఫ్యామిలీ అంతా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. మొత్తం ఫిలిం ఇండస్ట్రీనంతా దున్నేస్తున్నావ్ అంటూ కొనియాడారు. కరోనా సంక్షోభ సమయంలో కార్మికుల కోసం కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్లను ఆదుకున్నావు అని తెలిపారు.