సిద్ శ్రీరామ్‌కు అనంత శ్రీరామ్ బాసట!

192
ananth-sriram
- Advertisement -

సింగర్ సిద్ శ్రీరామ్‌కు రచయిత అనంత శ్రీరామ్ బాసటగా నిలిచారు. మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మే 12న ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ సినిమాలో కళావతి అనే పాటను రాశారు శ్రీరామ్.

ఈ పాటను సిద్ శ్రీరామ్ సరిగా పాడలేదని విమర్శలు వస్తుండగా దీనిపై స్పందించారు అనంత్ శ్రీరామ్. సిద్ శ్రీరామ్ ఎలాంటి ఉచ్చ‌ర‌ణ దోషాలు లేకుండా పాటను చాలా బాగా పాడాడ‌ని… ప్రేక్షకులు సిద్ శ్రీరామ్‌ను ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేశారన్నారు.

మంచి క‌థ‌కు పాట‌లు రాశాన‌ని ఎంత సంతోషంగా ఉందో, మ‌హేశ్ బాబు సినిమాకు పాట‌లు రాశాన‌ని కూడా అంతే సంతోషంగా ఉంద‌ని అన్నారు అనంత శ్రీరామ్‌.మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ మ‌హేశ్ హోం బ్యాన‌ర్‌ జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్ల‌స్ తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే క‌ళావ‌తి పాట‌ మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ రాబ‌డుతూ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

- Advertisement -