స్పోర్ట్స్ మిట్ 2021ను ప్రారంభించిన మంత్రి..

35
Minister Mallareddy

ఆదివారం మేడిపల్లి హనుమాన్‌ దేవాలయ ప్రాంగణంలో ఫిరజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి వార్షికోత్సవం సందర్బంగా స్పోర్ట్స్ మిట్ 2021 ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హజరైయ్యారు.ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, బ్యాట్‌మెంటన్‌, టెన్నికాయిట్‌, క్యారమ్‌, చెస్‌ షటిల్‌, తదతర క్రీడలు నిర్వహిస్తున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి ప్రజలను ఉత్తేజపరిచే కార్యక్రమాలు చేపడుతున్న మేయర్‌, కమిషనర్‌లను అభినందించారు.. క్రీడాల పోటీలో పాల్గొనడం వల్ల మానసికఉల్లాసంతో పాటు నూతన ఉతేజం లభిస్తుందని మంత్రి తెలిపారు. తాను 68సంవత్సరాల వయస్సులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం రోజూ వ్యాయాయం చేయడమేనని తెలిపారు. మేడ్చల్‌ నియోజక వర్గంలో 10 మున్సిపాలిటీలు ఉన్నా ఇలాంటి వినూత్నంగా ఆలోచించే మున్సిపల్‌ కార్పొరేషన్‌ చూడలేదన్నారు.