ప్రణాళికాబద్దంగా విశ్వనగరం చేస్తాం..

207
assembly
- Advertisement -

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్యం అన్ని చర్యలు తీసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదారాబద్ లోని రోడ్డు, త్రాగునీరు వంటి మౌలిక వసతులపై శాసన సభలో జరిగిన  చర్చపై మంత్రి వివరణ ఇచ్చారు. హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ప్రతీ రోజు నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అభివృద్ధిలో జీహెచ్‌ఎంసీ వేగంగా దూసుకెళ్తుందన్నారు.  హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య లేకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. హుస్సేన్‌సాగర్‌లోకి వచ్చే మురుగు నీటిని మళ్లించే కార్యక్రమం జరుగుతోందన్నారు. హుస్సేన్ సాగర్ శుద్ధీకరణ పనులు వేగవంతం చేశామన్నారు మూసీ నదీ పొడవునా నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అక్రమ కట్టడాలను అరికట్టేందుకు బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాలాలపై 938 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు కేటీఆర్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ ని ఐటీ కేంద్రంగా మార్చామని తెలిపారు. ఐటీ కారిడార్‌లో రూ.115.46కోట్లతో డ్రైనేజీ, రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించామన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్‌ఆర్‌డీపీ ద్వారా కాలుష్యం, ట్రాఫిక్ నియంత్రిస్తున్నామన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 113 కూడళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఉప్పల్‌లో వేసిన ప్లాస్టిక్ రోడ్ విజయవంతమైందన్నారు. 5 రేడియల్ రోడ్లలో మూడింటిని పూర్తి చేశామన్నారు. పెద్ద అంబర్ పేట్ నుంచి కీసర వరకు ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 75 శాతం మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తయ్యిందన్నారు. ఐదు బృహత్తర ప్రణాళికలు ఒకే మాస్టర్ ప్లాన్ కింద తీసుకువస్తున్నామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీ సర్కిళ్లను 18 నుంచి 30కి పెంచినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడానికి రూ.625కోట్ల రుణ సదుపాయం కల్పించినట్లు కేటీఆర్ తెలిపారు.

- Advertisement -