చివరి షెడ్యూల్ లో గోపీచంద్ చిత్రం…

132

మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నేడు నాలుగో షెడ్యూల్ ను ప్రారంభించుకోనుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నాలుగో షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

Gopichand Movie last fourth schedule

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. “థాయ్ ల్యాండ్, హైద్రాబాద్ లో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక నేటి నుంచి మొదలై ఫిబ్రవరి 20 వరకూ జరగనున్న నాలుగో షెడ్యూల్ లో హీరోహీరోయిన్లు గోపీచంద్-రాశీఖన్నా-కేతరీన్ లపై కాంబినేషన్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసేందుకు దర్శకుడు సంపత్ నంది సన్నాహాలు చేసుకొంటున్నారు. రామ్-లక్ష్మణ్ ల నిర్వహణలో చిత్రీకరించబడనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఇక సంపత్ నంది యాక్షన్ సీన్స్ తోపాటు ఎమోషనల్ సీన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం, ఆ సన్నివేశాల్ని మా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తన కెమెరాలో బంధించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. గోపీచంద్ ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నారు. సంపత్ నంది మార్క్ పవర్ ఫుల్ టైటిల్ తోపాటు గోపీచంద్ స్టైలిష్ లుక్ ను కూడా త్వరలో విడుదల చేస్తాం. అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మా బ్యానర్ విలువను పెంచే విధంగా ఉంటుంది. ఇకపోతే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం” అన్నారు.

గోపీచంద్, హన్సిక మొత్వాని, కేతరీన్, నికితీన్ ధీర్, తనికెళ్ళభరణి, ముఖేష్ రుషి, అజయ్, సచిన్ కేద్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, కెమెరా: ఎస్.సౌందర్ రాజన్, బ్యానర్: శ్రీ బాలాజీ సినీ మీడియా, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!