బీజేపీ నీతి మాలిన పార్టీ- మంత్రి కేటీఆర్

71
- Advertisement -

శుక్రవారం సిరిసిల్లలో చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి, టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తోంది. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చిందన్నారు. కేసీఆర్ హాయంలో రైతుకు వ్యవసాయానికి పెద్ద పీట లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగాం..అప్పుడు కరెంటు కూడా కిస్తీల వారీగా ఇచ్చేది.. దిక్కు లేని పరిస్థితి ఆనాడు..పచ్చ కండువాలు వేసుకున్నా రైతుల జీవితాలు ఆనాడు బాగు చేయలేక పోయారు పాలకులు..అన్నిటికీ లైన్లు కట్టే పరిస్థితి ఉండేది దుయ్యబట్టారు.

కేసీఆర్ ఎం మ్యాజిక్ చేస్తే 24 గంటల కరెంటు వచ్చిందని కొందరు అడుగుతుంటారు. పాలకుల మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి..కొందరి పాలనలో వరసగా కరువే.. ఇపుడు కరువు కూడా లేదు. చెరువులకు 20 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పల్లె జీవితాన్ని బాగు పరుచుకోగలిగాం..ప్రపంచంలో మేధావులని ఫోజు గొట్టే వాళ్లకు రాని ఆలోచన కేసీఆర్ కు వచ్చిన ఫలితమే రైతు బంధు, రైతు బీమా అని కేటీఆర్‌ అన్నారు. మన రైతు బంధును కేంద్రం సహా పదకొండు రాష్ట్రాలు కాపీ కొట్టాయి..రైతు చని పోయిన పది రోజుల్లోపే భీమా కింద ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి..నడి ఎండాకాలం ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో చెరువులు మత్తడి దుంకుతున్నాయి.. సిరిసిల్ల పట్టణంలో బ్రిడ్జి కింద నీళ్లు ఎపుడైనా చూశామా…కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీ పడి కేసీఆర్ నిర్మించారు.

రైతులకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నది కేసీఆర్ కాదా…తెలంగాణ రైతు ఇప్పుడు కాలర్ ఎగురేసి గర్వంగా చెబుతున్నాడు ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటి పోయామని.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా గ్రామాల బాట బట్టి వ్యవసాయం చేస్తున్నారంటే అది కేసీఆర్ రైతు పక్ష పాత విధానాల ఫలితమే అన్నారు. దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు..తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్ తపన..కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గూగుల్‌లో ఎవ్వరూ వెతికినా తెలిసి పోతుంది. కాళేశ్వరం నీళ్లతో 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణ పండించింది. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం 101 అని అక్టోబర్‌లో విడుదలైన ఓ నివేదిక చెబుతోంది.

ఆకలి రాజ్యాల లిస్టులో భారత్ ర్యాంక్ 101 అని చెప్పడం మనకు సిగ్గు చేటు కాదా…పొరుగున ఉన్న బంగ్లా దేశ్, నేపాల్, పాకిస్థాన్ ల రాంక్ లు వంద లోపే ఉన్నాయి..కాంగ్రెస్, బీజేపీల దిక్కు మాలిన పాలన దుస్థితికి ఈ రాంక్ అద్దం పడుతోందని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో బండి సంజయ్ తొండి సంజయ్ లాగా మారారు..బండి సంజయ్ తన పాద యాత్రలో మనం నిర్మించిన రైతు వేదికల్లో పడుకున్నారు. బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నా చేసినట్లు…మోడీ ధాన్యం కొంటామంటే మేము వద్దంటున్నమా? ..వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉంది..రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే..ఏ పంట వేయాలన్నది కేంద్రం చెప్ప జాలదు అన్నారు..ఆరేళ్లుగా అంతా బాగానే నడిచింది..తెలంగాణలో ప్రాజెక్టుల ఫలితంగా ధాన్యం ఉత్పత్తి పెరగగానే కేంద్రం కొర్రీలు పెడుతోంది అని కేటీఆర్‌ విమర్శించారు.

మాకు వరి పంట వేయడం తప్ప వేరేది రాదని మన రైతులు అంటున్నారు.కేంద్రం మాత్రం వరి వద్దు అంటోంది. పంజాబ్ కో న్యాయం తెలంగాణకు ఓ న్యాయమా…దేశానికి ఒక్క విధానం ఉండనవసరం లేదా? ..ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే ఇక్కడి బీజేపీ సంజయ్ వరే అంటున్నాడు.. పిచ్చోడు సంజయ్‌ని పార్లమెంట్‌కు ఎందుకు పంపారో అని కేటీఆర్‌ ఎద్దేవ చేశారు. ఓట్ల కోసం బీజేపీ రాజకీయాలు చేస్తోంది..ఎంపీ అయ్యాక సిరిసిల్లకు సంజయ్ ఒక్క రూపాయి అయినా తెచ్చారా.. చిల్లర ఓట్ల కోసం బీజేపీ రైతుల జీవితాలతో చలి మంటలు కాచుకుంటోంది..బీజేపీ రాజకీయాలకు ధీటుగా బదులిస్తాం..ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రైతు సమితిగా రైతుల కోసం నిలబడుతుంది అన్నారు..మోడీ, పీయూష్ గోయల్ వరి వేయాలంటే మేము కాదంటున్నమా బండి సంజయ్ చెప్పాలి అని డిమాండ్‌ చేశారు.

ఎందుకు ధర్నా చేశారో బీజేపీ నేతలకే తెలియదు..రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కేంద్రమంత్రి కొడుకు కారుతో తొక్కించారు.. ఎనిమిది మందిని చంపేశారు..బీజేపీ డ్రామాలు ఎల్ల కాలం నడవవు.. రైతు కన్నెర్ర జేస్తే ఎడ్ల బండి కింద బీజేపీ నలిగి పోక తప్పదు..బీజేపీ నీతి మాలిన పార్టీ..మిషన్ భగీరథకు డబ్బులు ఇవ్వరు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు.. పోలవరం అప్పర్ భద్రకు ఇస్తారు…జాతీయ పార్టీకి జాతీయ విధానం లేదు..ఈ రోజు పడింది మొదటి అడుగు మాత్రమే. కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచి పెట్టే ప్రసక్తే లేదు…తెలంగాణ కోసం కాంగ్రెస్ మెడలు వంచామ్.. వరిపై బీజేపీ మెడలు వంచలేమా…రైతుల వెంటే ఉంటాం.. రైతులు మాకు అండగా ఉండాలి అని మంత్రి కేటీఆర్ కోరారు.

- Advertisement -