రేవంత్‌కు ఇక చుక్కలే..!

86
ed revanth
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్ వంటి కాంగ్రెస్ సీనియర్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని తప్పు పట్టిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి విసిరిన 50 కోట్లకు పీసీసీ పదవిని అమ్ముకున్నాడని ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన ఓటుకునోటు దొంగలను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అధిష్టానంపై కోమటిరెడ్డి కస్సుబుస్సలాడారు. అయితే అధిష్టానం రేవంత్ రెడ్డిని వెనకేసుకురావడంతో కోమటిరెడ్డి సైలైంట్ అయ్యారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ వాయిస్ పెంచారు.

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కుమ్మక్కై పార్టీని బొందపెట్టారని రేవంత్‌పై ఫైర్ అవుతున్నారు. పీఏసీ భేటీలో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు వంటి నేతలు ఈటలతో కుదిరిన లోపాయికారీ ఒప్పందం ఏంటో బయటపెట్టాలని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎటు వెళ్లిందో చెప్పాలని రేవంత్‌ రెడ్డికి ఠాగూర్ ముందే చుక్కలు చూపించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు రేవంత్ వేసిన ప్లాన్ బెడిసికొట్టి అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికికే ఎసరు తెచ్చాడు. దీంతో కాంగ్రెస్ సీనియర్లు ఇదే అదనుగా అధిష్టానం ముందు రేవంత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నరు. రేవంత్‌ను ఇప్పటికిప్పుడు టీపీసీసీ పదవి నుంచి దించేయకున్నా..ఇదివరకులా వన్‌మేన్ షో చేయకుండా ఆయన చుట్టూ చక్రబంధం బిగించేందుకు సీనియర్లు రెడీ అవుతున్నరంట…అయితే కాంగ్రెస్ సీనియర్లు ఇలా దూకుడు పెంచడం వెనుక ఢిల్లీ హైకమాండ్‌ పెద్ద హస్తం ఉందని రేవంత్ వర్గం అనుమానిస్తుందంట…ఆయన ఎవరో కాదు వైఎస్ఆర్ ఆత్మగా పేరుగాంచిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచందర్‌రావు… కోమటిరెడ్డి వెనుక ఉండి కేవీపీ కథ నడిపిస్తున్నారని రేవంత్ వర్గం ఆరోపిస్తోంది.

రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్, కేవీపీల కరప్షన్‌పై ఏకంగా యుద్ధమే చేశాడు. డైలీ ప్రెస్‌మీట్లు పెట్టి మనీలాండరింగ్ వ్యవహరాల్లో , అమెరికాలో కేసులు అంటూ కేవీపీకి చుక్కలు చూపించాడు.. ఏకంగా ఈడీ, సీబీఐకి ఫిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవీపీ సీఎం కేసీఆర్‌కు ఆత్మగా వ్యవహరిస్తున్నట్లు , రైతుబంధు వంటి పథకాల వెనుక ఆయన సలహాలు ఉన్నాయని రేవంత్ వర్గం అనుమానిస్తోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అయిపోయినట్లే అని రేవంత్ కలలు కంటున్నడు..ఈ నేపథ్యంలో గతంలో తాను చేసిన ఆరోపణలతో కేవీపీ తనపై కక్ష కట్టాడని, కోమటిరెడ్డితో సహా కాంగ్రెస్ సీనియర్లు తనను అధిష్టానం ముందు డిగ్రేడ్ చేయడం వెనుక ఆయన హస్తం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడంట.. తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్ ఆత్మ చ‌క్రం తిప్పుడం వల్లే సీనియర్లతో కొత్త కిరికిరి మొదలైందని రేవంత్‌ కలవరపెడుతున్నడంట..అందుకే రాజేంద్రనగర్‌లోని ఓ ఫామ్ హౌస్ సాక్షిగా కోమటిరెడ్డితో సహా కాంగ్రెస్ సీనియర్లతా రేవంత్‌కు చెక్ పెట్టేందుకు కేవీపీ సమక్షంలో వ్యూహారచన చేస్తున్నారని ఎల్లోమీడియా పచ్చ రాతలు మొదలుపెట్టింది. మొత్తంగా కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీ హైకమాండ్ నేత కేవీపీ డైరెక్షన్‌లో నడుస్తున్నారని, మున్ముందు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయమని గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది.

- Advertisement -