నితిన్‌ ‘భీష్మ’కు కేటీఆర్‌ భరోసా..

243
ktr

టాలీవుడ్‌ హీరో నితిన్‌ నటించిన భీష్మ సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో వీక్షిస్తున్నట్లు వెంకట్‌ అనే యువకుడు ఫొటోలు తీసి డైరెక్టర్‌ వెంకీ కుడుములకు ట్వీట్‌ చేశాడు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ వెంకీ కుడుముల మంత్రి కేటీఆర్‌కు వివరిస్తూ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ సినిమాలు వేయడం చాలా బాధాకరం. సర్‌ మాకు ఏ సమస్య వచ్చినా ట్యాగ్‌ చెయ్యాలనిపించే ఒకే ఒక్క ఐడీ మీది అని అయన తెలిపారు.

దీనిపై మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ.. ఈ అంశాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్తా. పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. ఇక నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి చిత్రాన్ని నిర్మించారు.