విజయ్ చాలా స్మార్ట్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ..!

285

సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ మూవీ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రిప్టుకు ఫిదా అయిన కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు. ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

Vijay Devarakonda

ఇక విజయ్ దేవరకొండ జోడీగా అనన్య పాండేను ఇందులో నటిస్తోంది. కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతున్న షూటింగులో ఇటీవలే ఆమె జాయిన్ అయింది. తాజా ఓ ఇంటర్వ్యూలో ఆమె విజయ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. విజయ్ దేవరకొండ అందరితోనూ చాలా కలుపుగోలుగా మాట్లాడతాడని.. సెట్లో ఎప్పుడూ నవ్వుతూ సందడి చేస్తుంటాడని తెలిపింది.

విజయ్‌ చాలా స్మార్ట్ అండ్ కైండ్.. కొత్తవారితో ఎలా మాట్లాడాలో ఆయనకి బాగా తెలుసు. విజయ్ దేవరకొండ మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. ఆయనతో ఈ సినిమా చేస్తున్నందు వలన ప్రత్యక్షంగా చూస్తున్నాను. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిస్తోంది” అని చెప్పుకొచ్చింది.