కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్న దిశా పటానీ..!

572
disha patani
- Advertisement -

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నటిస్తోన్న చిత్రం బాఘీ-3. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మించాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అన్నదమ్ముల అనుబంధానికి యాక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ అన్నగా రితేశ్ దేశ్‌ముఖ్ నటించాడు. అయితే.. ఈ చిత్రంలో దిశా పటానీ ఐటమ్ సాంగ్‌ చేసింది.

డు యు లవ్‌ మీ అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ సాంగ్‌లో దిశా పటానీ బికినీలో కనువిందు చేసింది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ, సెగలు పుట్టించే హావభావాలు పలికిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే కోటి 16 లక్షల మంది చూసిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం రేపుతోంది. ఈ పాటను నిఖితా గాంధీ పాడింది. మార్చి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -