పోలీసుల‌పై మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు..

42
ktr

తెలంగాణ పోలీసులు క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ విరామం లేకుండా ప‌ని చేస్తున్నార‌ని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. క‌రోనా నివార‌ణ‌కు వినియోగించే మెడిసిన్స్, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లను బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్ప‌డుతున్న వారిపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూ, త‌మ వంతు కృషి చేస్తున్నార‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

క‌రోనా సెకండ్ వేవ్‌లో క‌రోనా మెడిసిన్స్‌ను బ్లాక్‌లో అమ్ముతున్న వారిపై 128 కేసులు న‌మోదు చేశార‌ని, 258 మందిని అదుపులోకి తీసుకున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాల‌నుకుంటే 100కు డ‌య‌ల్ చేయొచ్చు. లేదా తెలంగాణ డీజీపీకి ట్వీట్ చేయాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.