పౌల్ట్రీ, పత్తి, వేరుశెనగలకు తెలంగాణ ప్రసిద్ధి..

52
ktr
- Advertisement -

పౌల్ట్రీ, పత్తి, వేరుశెనగలకు తెలంగాణ ప్రసిద్ధి అన్నారు మంత్రి కేటీఆర్. వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల ఆలోచనా విధానం మారాలన్నారు.సిద్దిపేట జిల్లా ములుగు ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ 2వ సమావేశంలో పాల్గొని మాట్లాడారు కేటీఆర్.

రైతుల ఆదాయం రెట్టింపు అన్నది ఒక్క చైనాలోనే సాధ్యం అయింది .. నాకున్న సమాచారం ప్రకారం అది మరెక్కడా సాధ్యం కాలేదన్నారు. 2022 వరకు మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని విఫలమయ్యారు..దేశంలో దాదాపు 60 – 65 శాతం జనాభా వ్యవసాయం , దాని అనుబంధ రంగాల మీద ఆధారపడింది .. కానీ దేశ జీడీపీలో దాని వాటా 15 శాతం దాటడం లేదన్నారు.వ్యవసాయంలో రైతుకు ఆదాయం ఎలా వస్తుందో ఆలోచన చేయాలి .. చైనా, ఇజ్రాయిల్ లలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు.

1987 లో చైనా – ఇండియా జీడీపీ సమానం అన్నారు. 35 ఏళ్లలో చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరింది .. ఇండియా 3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉందని…తెలంగాణలో వరి మళ్లలో చేపలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది .. ఈ దిశగా ప్రయత్నించాలన్నారు. వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువత ఈ దిశగా మళ్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో బ్లూ, పింక్, వైట్, ఎల్లో,గ్రీన్ విప్లవాలు విజయవంతమయ్యే అవకాశాలున్నాయన్నారు.

- Advertisement -