తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ మరియు తెలంగాణ విజయ గర్జన కార్యక్రమాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గస్థాయి ప్రతినిధులతో చేపట్టిన సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఈరోజు ముషీరా బాద్, అంబర్ పేట్, ఖైరతా బాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, నిజామాబాద్ అర్బన్, నిజమాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్ పేట్, బహదూర్ పుర, కార్వాన్, యాకుత్ పుర నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో రూపొందించుకోవాల్సిన కార్యాచరణ పైన మార్గదర్శనం చేశారు. ఈ సమావేశాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్ అలీ, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మరియు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.