మీలో ఎవరు కోటీశ్వరుడు…పూర్తిచేసిన ఎన్టీఆర్!

126
jr ntr
- Advertisement -

జెమినీ టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1కు సంబంధించి 60 ఎపిసోడ్స్ ప్లాన్ చేయగా ఇప్పటికి 37 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాయి. అయితే మిగిలిన 23 షోలకు సంబంధించి కూడా షూటింగ్‌ని ఎన్టీఆర్ పూర్తి చేసినట్లు సమాచారం.

ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 1 కోసం తారక్ ఏకంగా 7.5 కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకున్నారట. ఇక తొలి ఎపిసోడ్‌కు అతిథిగా చరణ్ రాగా రీసెంట్‌గా సమంత హాజరై 25 లక్షలు గెలుచుకుంది.

త్వరలో ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తారక్ షోలో మెరవనున్నారు. అయితే సీజన్‌ 1లో ఎవరైనా రూ.కోటి గెలుచుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -