మొబైల్‌ ఐసీయూ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

47
ktr

ట్యాంక్‌బండ్‌ వద్ద మొబైల్‌ ఐసీయూ బస్సులను మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కలిసి ప్రారంభించారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. మొబైల్‌ ఐసీయూ బస్సులో 10 ఆక్సిజన్ బెడ్లు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్, సిసి టివి మరియు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శ్రీ సోమేశ్‌ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు శ్రీ సాయన్న, శ్రీ ముఠా గోపాల్, నగర పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్‌ మొబైల్‌ బస్సులను అందించిన లార్డ్స్‌ చర్చికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లో మెడికల్‌ యూనిట్‌ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. తొలి విడుత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. కొవిడ్‌ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్‌ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు.