కోవిడ్‌తో 624 వైద్యులు మృతి- ఐఎంఏ

68

కరోనా సెకండ్ వేవ్‌లో సామాన్య ప్రజలతో పాటు వైద్యులు కూడా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనాతో 624 మంది డాక్టర్లు మృతి చెందినట్లు తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు జూన్ 2 వరకు లెక్కించిన గణాంకాలు ఐఎంఏ విడుదల చేసింది. తెలంగాణలో 32 మంది వైద్యుల మృతి చెందగా..అత్యధికంగా ఢిల్లీలో 109 మంది వైద్యులు మరణించారు. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్ (96), ఉత్తర్ ప్రదేశ్ (79), రాజస్థాన్ (43) మంది డాక్టర్లు మృతి చెందారు.