మంత్రి కేటీఆర్‌కు యూఏఈ ఆహ్వానం

207
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఐటీ రంగం తెలంగాణ రాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కుతూ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అభించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ముచ్చటపడిన యూఏఈ ప్రభుత్వం తమ దేశంలో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌ను కోరింది. ఈ మేరకు యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్‌ జహెడ్‌ అల్‌ నాహ్యాస్‌ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు.

Minister-KTR

తెలంగాణ రాష్ట్రంలో విద్యా, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరు ప్రాంతాల మద్య బలమైన సంబంధాల దిశగా కృషి చేద్దామని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాను తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి దన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొచ్చిన పలు కీలకమైన అంశాల్లో తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామి ఇచ్చారు. యూఏఈ ప్రభుత్వం తనను తమ దేశంలో పర్యటించాలంటూ ఆహ్వానం పంపండంపై మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో గల్ప్‌ కార్మికుల సమస్యలు చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -