పెద్దసారూ.. నిను మరువం

289
Professor-Jayashankar

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని, పోరాట భావజాలాన్ని రగిలించిన ఉద్యమ వారధి జయశంకర్‌ సార్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ ఉద్యమానికి స్పూర్తిప్రధాత… కొత్తపల్లి జయశంకర్‌ సార్‌కు ఇదే మా నమస్సుమాంజలి అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అటు ఆదిలాబాద్‌ జిల్లాలో మంత్రి జోగురామన్న జయశంకర్‌ సార్‌కు నివాళులర్పించారు. సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ సార్‌ పాత్రను, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి జయశంకర్‌ సార్‌కు నివాళులర్పించారు.