సమగ్రాభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం- మంత్రి కొప్పుల

152
- Advertisement -

వయోవృద్ధుల కార్పోరేషన్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వృద్ధుల భద్రత, సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నది. సంక్షేమం, సమగ్రాభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు మంత్రి కొప్పుల. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆయన పెద్దపల్లి నుంచి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందనే సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోతాం.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది అన్నారు. వయోవృద్ధులకు ప్రతి జిల్లాలో ఆశ్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. తొమ్మిది చోట్ల పనులు కొనసాగుతున్నాయి. డే కేర్ సెంటర్లలో టివిలు, ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు ఏర్పాట్లు చేస్తమని మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో సేవాభావం ముందుకు సాగుతున్న ట్రస్టులు,సంస్థల ఆధ్వర్యంలో 267 ఆశ్రమాలు ఉండడం సంతోషదాయకం.. వృద్ధులు కరోనా మహమ్మారి బారినపడకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మనందరికి తెలిసిందే. ఈ మేరకు టోల్ ఫ్రీ నంబర్,హెల్ప్ లైన్ల ద్వారా ఎప్పటికప్పుడు స్పందిస్తూ తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. మాస్కులు,శానిటైజర్లు పంపిణీ చేయడం,వైద్య సేవలందించడం, అవసరమైన మందులు,కిట్లు సరఫరా చేయడం, టీకాలు వేయించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా వయో వృద్ధులకు సేవలందిస్తున్న నాగచంద్రికకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 72 ఏండ్ల వయస్సులో కూడా ఆరోగ్యంగా,ఉత్సాహంగా డాన్స్ చేసిన విజయ్ కుమార్‌ను ప్రశంసిస్తున్న.. వయో వృద్ధులు,దివ్యాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వ కార్యదర్శి దివ్యా దేవరాజన్,కమిషనర్ శైలజ,ఇతర అధికారులందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్న అని మంత్రి కొప్పులు పేర్కొన్నారు.

- Advertisement -