రాణించిన రాహుల్…పంజాబ్ గెలుపు

111
kkr

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఉత్కంఠపోరులో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్,అగర్వాల్ రాణించడంతో పంజాబ్ విజయం సాధించింది.

కోల్ కతా విధించిన 167 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 168 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(67: 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్(40: 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యారు 67,త్రిపతి 34,నితీశ్‌ రానా 31 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3,బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టారు. హాఫ్ సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.