కెటిఆర్‌ అకస్మిక పర్యటన..

235
Minister K T Rama Rao, conducted surprise inspections in the Industrial areas
- Advertisement -

నగరంలోని కాలుష్యాకారక పరిశ్రమల తరలింపు పైనా సమగ్ర విధానంతో ముందుకు పొతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఒక వైపు పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలనకు తరలించే కార్యక్రమాన్ని దీర్ఘకాలికంగా చేపడుతూనే, ప్రస్తుతం కాలుష్య ప్రమాణాలను ఉల్లగించే పరిశ్రమలపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జీడిమెట్ల, బాలనగర్ వంటి ప్రాంతాల్లోని ప్రజలకు కాలుష్య కష్టాలను తగ్గించేందుకు గత కొద్ది సంవత్సరాలుగా కాలుష్యాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వాలు కొరుతూనే ఉన్నాయని మంత్రి తెలిపారు. అయితే నగరంలోని ప్రజలకు కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. ఈమేరకు వారం రోజుల పాటు పగలు, రాత్రి  తనీఖీలు చేపట్టాలన్నారు. అయితే ఈ తనీఖీల్లో ఏలాంటి రాజకీయ జోక్యం లేకుండా తాను చూస్తానన్న మంత్రి, తనీఖీలను పక్భందీగా చేయాలని అదేశాలు జారీ చేశారు. కాలుష్య ప్రమాణాలు ఉల్లంఘించే వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.
  Minister K T Rama Rao, conducted surprise inspections in the Industrial areas
మరోపైపు అక్రమంగా నాలాల్లోకి కాలుష్య వర్ధ్యాలను డంపు చేస్తున్న  వాహనాలను సీజ్ చేయాలన్నారు. ఈ స్పేషల్ డ్రైవ్ లో అవసరం అయితే పొలీసు శాఖ  సహకారం తీసుకోవాలని, ఈ మేరకు జిల్లా యస్పీలతో మాట్లాడాలన్నారు. జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఒపెన్ నాలల్లో వ్యర్ధాలు డంపింగ్ చేస్తున్న వారిని నియంత్రించేందుకు సిసి కెమెరా నెట్ వర్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. స్థానిక యంపి, ఏంఏల్యే, ఏంఎల్సీ నిధుల నుంచి 1 కోటి రూపాయాలు ఈ మేరకు ఖర్చు  చేస్తామన్నారు. అవరసం అయితే ప్రభుత్వం తరపున మరో రెండు కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి తెలిపారు. ఈ కెమెరా నెట్ వర్క్ ను పొలీస్, జియచ్ యంసి, పిసిబి కార్యాలయాలతో కనెక్ట్ చేస్తామని తెలిపారు.
   Minister K T Rama Rao, conducted surprise inspections in the Industrial areas
జీడిమెట్ల, బొల్లారం, బాలానగర్ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ పైన 18వ తేదిన పరిశ్రమలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాన్ని, అలోచనను స్వయంగా నేనే వివరిస్తానన్నారు. పొలీస్, జియచ్ యంసి, ట్రాన్స్ పొర్ట్, జిల్లాల కలెక్టర్లను సైతం ఈ సమావేశాని హజరవ్వాలని మంత్రి కోరారు.  ప్రభుత్వం పరిశ్రమ ప్రేండ్లీ అయినపట్టికీ, చట్టబద్ద ప్రమాణాలు, ప్రజల అరోగ్యం సైతం అంతే ప్రధానమైనవని మంత్రి తెలిపారు. ఉద్యోగాలు కల్పన చేస్తున్న కంపెనీలను గౌరవిస్తునే, కాలుష్యాన్ని వెలువరించే వాటిని ఖచ్చితంగా చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామన్నారు.

పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంలో ఉన్న ఉత్తమ పద్దతుల అధ్యాయనానికి, జపాన్, కొరియా వంటి దేశాల్లో పర్యటించాలని అధికారులను మంత్రి కోరారు. వచ్చే హరిత హరం కార్యక్రమంలో సాద్యమైనన్ని అధికంగా మొక్కలు నాటాలన్నారు. ఈ మేరకు సువాసనలు వెదజల్లే మెక్కలను నాటాలన్నారు. దీంతో కొంత మేరకు వాసన తగ్గే అవకాశం ఉంటుందన్నారు. పారిశ్రామిక వాడాల్లో హరితహరం పైన ప్రత్యేకంగా కార్యాచరణ చేయాలని మంత్రి టియస్ ఐఐసి అధికారులకు అదేశాలు జారీ చేశారు.

జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు అకస్మిక పర్యటన జీడిమెట్ల పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు అకస్మిక పర్యటన చేశారు. ముందుగా పారిశ్రామిక వాడలోని పారిశ్రామిక వ్యర్ధ జల ట్రీట్ మెంట్ ప్లాంట్లో పర్యటించిన మంత్రి, అక్కడి పరిస్దితులపైన పరిశీలన చేశారు. ప్లాంట్ నిర్వహణ జరుగుతున్న తీరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి కార్మికులకు పూర్తి స్థాయి రక్షణ ప్రమాణాలు కల్పించాలని అధికారులు అదేశించారు. సాంపిల్ సేకరణ పాయింట్ వద్ద బయట నుండి వచ్చిన ట్యాంకర్లలోని సాంపిళ్లను స్వయంగా పరిశీలించారు. ప్లాంటు నిర్వహణ మరింత శుభ్రంగా, అత్యుత్తమ ప్రమాణాలతో జరగాలని, మరో వారం రోజుల్లో అకస్మిక తనీఖీ చేస్తానని మంత్రి తెలిపారు.  తర్వతా ఒపెన్ నాలాల్లో డపింగ్ చేస్తున్న పలు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమల్లోకి వెళ్లి అక్కడి నుంచి వస్తున్న కాలుష్యాకారకాలను పరిశీలించారు. పలు పరిశ్రమల్లోంచి సాంపిళ్లను తీసుకుని పిసిబి పరీక్షలకు పంపారు.
 Minister K T Rama Rao, conducted surprise inspections in the Industrial areas
తర్వతా జీడిమెట్ల పరిసరాల్లోని కాలనీల్లోకి వెళ్లి అక్కడి పౌరులతో మాట్లాడారు. కాలుష్యం వలన ఘాటైన వాసనలు, బోరు బావుల్లోంచి రంగు నీళ్లు వస్తున్నాయని మంత్రికి వారు పిర్యాదు చేశారు. వీటన్నింటికి దీర్షకాలిక పరిష్కారాలతో మాత్రమే పరిస్థితి మేరుగు పడుతుందన్న మంత్రి అ దిశగా ప్రభుత్వ కార్యచరణ చేస్తున్నట్లు తెలిపారు. తర్వతా పలు ప్రాంతాల్లో వ్యర్థాలను మండిస్తున్న చోట్ల అగి, అధికారుల అలసత్వంపైన అగ్రహం వ్యక్తం చేశారు. తర్వత పలు ప్రగతి నగర్ తోపాటు చెరువులను పరిశీలించి, వాటి అభివృద్ది చేసేందుకు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల ఏర్పాటు మాత్రమే పరిష్కారమన్నారు. అవకాశం ఉన్న చోట్ల వేంటనే వాటిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క తీయాలని జియచ్ యంసి అధికారులకు అదేశాలు జారీ చేశారు.

- Advertisement -