ముస్లింలకు కేసీఆర్ మాత్రమే న్యాయం చేస్తున్నారు: షకీల్

144
trs mla shakhil talks in ts assembly about reservations

బీసీ-ఈ వర్గానికి రిజర్వేషన్ పెంచడం మతపరమైన రిజర్వేషన్ కాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. గిరిజనులు, బీసీ-ఈ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు తప్పనిసరి అని చెప్పారు. మైనార్టీలకు కోటా పెంపు మంచి నిర్ణయమని పేర్కొన్నారు.

వర్గాలకు రిజర్వేషన్లు పెంచడం మతపరమైన కోటాగా బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు.. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ అని స్పష్టం చేశారు. ముస్లింలు ఎస్సీల కన్నా వెనుకబడి ఉన్నారని తెలిపారు. అన్ని పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయి కానీ వారి సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ముస్లింలకు న్యాయం చేస్తున్నారని  చెప్పారు.