ప్రభుత్వ ఆసుపత్రులోనే మెరుగైన వైద్యం: మంత్రి జగదీష్ రెడ్డి

127
Minister Jagadish Reddy
- Advertisement -

కరోనపై చేసే పోరాటంలో భాగస్వామ్యం అయేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరి దాతృత్వం వర్తమాననికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనామహమ్మరిని ఎదుర్కోవడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు, సంఘాలు,వ్యక్తిగతంగా కొందరు ఇతోధికంగా సహాయపడడానికి ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. కరోనా రెండో దశ ఉదృతం అవుతున్న వేళ అక్షిజన్ ను అందుబాటులో ఉంచడానికి సూర్యాపేట జిల్లాకు చెందిన యన్ ఆర్ ఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట మెడికల్ కళాశాలకు 10 అక్షిజన్ కాన్ సెంట్రేటర్స్ ను బహుకరించారు. వాటిని శనివారం ఉదయం మెడికల్ కళాశాల ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట,నల్లగొండలలో నెలకొల్పిన మెడికల్ కళాశాలలే వయస్సుతో నిమిత్తం లేకుండా కరోనా పేషేంట్ల ప్రాణం నిలుపుతున్నాయన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు ప్రాణదానం చేస్తుంటే మెడికల్ కళాశాలల ప్రాశస్త్యాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి,ముందుచూపు,ఆలోచనలే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. అన్ని గ్రామాల్లో ఆరోగ్య సర్వే జరుగుతుందని,కరోనా సోకిందని గుర్తిస్తే అక్కడికక్కడే కిట్లు అందజేస్తున్నామని ఆయన చెప్పారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.

అన్నింటికీ మించి మానసిక ధైర్యమే కరోనకు మందు అని,సోకినంత మాత్రాన ఏ ఒక్కరూ అధైర్య పడొద్దని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలలోనే మెరుగైన వైద్యం లభిస్తుందని ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో వైద్యం అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు,ఆయా ఆసుపత్రిల సిబ్బంది పని తీరును ఆయన ప్రశంశించారు.ఈ ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, మెడికల్ కళాశాల సూపరెండేంట్ దండా మురళీధర్ రెడ్డి,ఆర్ యం ఓ కళావతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -