గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ తదితర పార్టీల తీరు మూర్ఖత్వానికి పరాకాష్ట గా మారిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన….పీసీసీ చీఫ్ ఉత్తమ్ తాజా వ్యాఖ్యలు ఆయన బానిస మనస్తత్వానికి నిదర్శనం అన్నారు.తెలంగాణ రాష్ట్రం రావడం ఉత్తమ్ లాంటి వారికి ఇష్టం లేదు ..తెలంగాణ వచ్చి తమ అధికారం పోయిందనే భావన వారిలో ఉంది ..హైదరాబాద్ లో సెక్షన్ 8 పెట్టాలనే అజ్ఞానపు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ఇపుడు రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉన్నపుడు సెక్షన్ 8 ప్రస్తావన అర్థరహితం …కాంగ్రెస్ నేతలు అజ్ఞానం ,మూర్ఖత్వం తో మాడ్లాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవడం కాంగ్రెస్ తదితర పార్టీలకు ఇష్టం లేదు …కెసిఆర్ పాలన లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది
…విద్యుత్ తలసరి వినియోగం లో తెలంగాణ అగ్రభాగాన ఉంది…తాగు నీటి కోసం నాలుగు కిలోమీటర్లు నడిపించిన ఘనత కాంగ్రెస్ నేతలదే అన్నారు.
ఇపుడు నీళ్ల కష్టాలు లేవంటే అది కెసిఆర్ పాలన వల్లే …కాంగ్రెస్ నేతలు వంద జన్మలు ఎత్తినా రైతు బంధు లాంటి పథకం అమలు చేసే వారు కాదు ..తెలంగాణ రైతాంగం వైపే దేశం ఇపుడు చూస్తోంది…కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఎందుకు అమలు చేయరు ? …కరోనా కట్టడి లో తెలంగాణ యే దేశానికి దారి చూపిందన్నారు. వలస కార్మికుల విషయం లో కెసిఆర్ చూపిన మానవత ను అందరూ ప్రశంసించారు…ప్రగతి భవన్ కడితే ఏడ్చారు ,ఇపుడు సచివాలయం కడుతుంటే ఏడుస్తున్నారు
…సచివాలయం కడితే ఎందుకు ఏడుపు ? …సచివాలయం కడుతామని మా మేనిఫెస్టో లో చెప్పాము .మాకు ప్రజలు తీర్పు ఇచ్చారు…మా మేనిఫెస్టో ను అమలు చేస్తే మీకెందుకు నొప్పి ?…కాంగ్రెస్ హాయం లో మేనిఫెస్టో అమలు చేసిన పాపాన పోలేదు …కాంగ్రెస్ లాంటి దరిద్రపు ప్రతిపక్షం దేశం లోనే లేదన్నారు.
కరోనా కంటే దరిద్రమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ …మేము ఏం చేసినా వద్దంటున్నారు కనుకే కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు వద్దన్నారు …ఉత్తమ్ ను ఆ పార్టీ నేతలే వద్దంటున్నారు .మా మీద ఆయన విమర్శలు చేస్తున్నారు ..హుజుర్ నగర్ ఉప ఎన్నికలో ప్రజలు మా పాలనకు అనుకూలంగా తీర్పిచ్చారు …కాంగ్రెస్ తన తీరు మార్చుకోకుంటే తెలంగాణ ప్రజల చేతిలో ఆ పార్టీ లో కుక్క చావు తప్పదు …కెసిఆర్ కుటుంబం పై ఈర్శ్య ,ద్వేషాలతో ఆరోపణలు చేస్తున్నారు…వచ్చిన తెలంగాణ వెనక్కు పోయినా పర్వా లేదనే రీతిలో కాంగ్రెస్ నేతల తీరు ఉంది…కరోనా పై దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు…సెక్షన్ 8 పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యల పై హైదరాబాద్ ప్రజలు బుద్ది చెబుతారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి.