సచివాలయ నిర్మాణం…వెనుకడుగు వేసే ప్రసక్తేలేదు

93
palla

టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ను తూచ తప్పకుండా అమలు చేస్తున్నాం అని తెలిపారు రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పల్లా…..సచివాలయ నిర్మాణం పై వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. పాలనా సౌలభ్యంలో భాగంగానే కొత్త నిర్మాణాలు చేపడుతున్నాం అన్నారు.

దేశ రైతాంగం కష్టాల్లో ఉంటే తెలంగాణ రైతాంగం దేశానికి దారి చూపింది …వ్యవసాయ రంగం లో సీఎం కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశం యావత్ కొనియాడుతోంది
…అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్న కెసిఆర్ కు ప్రతి ఎన్నికల్లో ప్రజలు మద్దతిస్తున్నారని తెలిపారు పల్లా.

సెక్షన్ 8 పై ప్రతి పక్షాలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాయి …ఎన్ని పెడ బొబ్బలు పెట్టినా కాళేశ్వరం కట్టి చూపించామన్నారు. కొత్త సచివాలయం కట్టి తీరుతాం
…కొత్త సచివాలయం తెలంగాణకు షాన్ ..అద్భుతంగా నిర్మిస్తాం అన్నారు. ప్రతి ఎన్నికలో ప్రజలు బుద్ధి చేప్పినా కాంగ్రెస్ తీరు మారడం లేదన్నారు.

తెలంగాణ లో అభివృద్ధి ,సంక్షేమం సమ పాళ్ళలో అమలవుతోందన్నారు ఎంపీ రాములు. ప్రతి పక్షాలు దుగ్ధ తోనే మా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాయని
…ప్రతిపక్షాలకు ప్రజల ఆదరణ లేదన్నారు.