వ్యవసాయాన్ని పండగలా మారుస్తున్న సీఎం కేసీఆర్..

344
jagadish reddy
- Advertisement -

వ్యవసాయాన్ని పండగలా మార్చి, రైతులకు అధిక లాభాలు వచ్చేలా ముఖ్యమంత్రి కెసీఆర్ నియంత్రిత పంటల విధానాన్ని అమలు చేస్తున్నరని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజిక వర్గంలోని వివిధ మండలాల్లో 15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్దాపనలు చేశారు.

ఈ వానాకాలం సీజన్ లో ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు ఆర్దిక సాయం అందజేస్తామని ప్రఖ్యాతి గాంచిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిఫుణులు , అధికారులతో మోధో మధనం చేస్తూ ముఖ్యమంత్రి కెసీఆర్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా తెలంగాణా రైతాంగాన్ని సన్నద్దం చేస్తున్నరని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజికవర్గాల్లో రైతు బంధు సమీతీల ఆద్వార్యంలో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని జగదీష్ రెడ్డి అన్నారు..ఇక ప్రజా ప్రతనిధులు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని , కరోనా మహమ్మారి పోలేదని , మీటర్ దూరంలో కరోనా ఉందన్న ప్రమాదాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం మెరుగు పడిందని ,, నిర్లక్ష్యంగా ఉంటె కరోనా కబలించే ప్రమాదం ఉందని మంత్రి అన్నారు…ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపీకా యుగేంధర్ రావు,జెడ్పీ వైస్ ఛైర్మెన్ వెంకటనారయణ గౌడ్, వట్టె జానయ్య యాదవ్, జెడ్పీటీసీ భిక్షం, ఎంపీపీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -