రైతుల కోసమే నూతన వ్యవసాయ విధానం…

307
maareddy srinivas reddy
- Advertisement -

సీఎం కేసీఆర్ రైతు ప్రయోజనాల కోసం వ్యవసాయంలో నూతన విధానం తీసుకొస్తున్నారని చెప్పారు మార్క్‌ ఫెడ్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్‌లో మాట్లాడిన ఆయన రైతులు ధనికులు కావాలని తీసుకున్న నిర్ణయం పై కొందరు మూర్కులు లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.

కొందరు రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని…జిల్లా ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తానన్న మాట మార్చి పోయారు దీనిపై రైతులు ప్రశ్నించాలన్నారు.

తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని…సీఎం కేసీఆర్ గిట్టుబాటు ధర వచ్చే పంటలు పండించాలని రైతులను కోరుతున్నారని చెప్పారు.

మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని…రైతు బంధు డబ్బులు ఎట్టిపరిస్థితుల్లో ఆపొద్దని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారన్నారు. రైతు బంధు పై అపోహలు పెట్టుకోవద్దన్నారు.

- Advertisement -