అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు: జగదీష్ రెడ్డి

207
jagadish reddy
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని అప్పటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.అక్కడి నుండి వచ్చి ఇక్కడ పాలించిన ముఖ్యమంత్రలకు పండుగ ప్రాశస్త్యం తెలియదని ఇక్కడి వారికి పట్టింపే ఉండదని ఆయన దెప్పి పొడిచారు.2014 కు ముందు సాగిన పాలనలో ఏనాడైనా పండుగ ల పూట పేద ప్రజల మద్యకు ప్రజా ప్రతినిధులు వచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకోసం బతుకమ్మ పండుగ కానుకగా ప్రవేశపెట్టిన చీరల పంపిణీ పథకాన్ని మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం ఉదయం సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ అడిగితే జైళ్ల పాలు చేశారని,విత్తనాలు అడిగితే లాఠీ ఛార్జ్ చేశారని అటువంటి పాలకుల ఎలుబడిలో పండుగలు పబ్బాలు గుర్తుకే రాలేదని దుయ్యబట్టారు.మోడీ ఎలుబడిలో ఉన్న గుజరాత్ లో కానీ సోనియమ్మ సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో ఉచిత విద్యుత్ సంగతి ఏమో గాని 24 గంటల విద్యుత్ సరఫరా లేదని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో రెండుసార్లు గులాబీకి పట్టం కట్టినందునే ఈ రోజు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామన్నారు.పేదల హృదయాలకు దగ్గరయి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారన్నారు.అడుగక ముందే వరాలు ప్రకటించిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు.

అందులో బాగామే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న చీరలు అని ఆయన చెప్పుకొచ్చారు.అధికారంలోకి వచ్చిందే తడవుగా ఆడపిల్లల పెండ్లికి కళ్యాణలక్ష్మీ పథకాన్ని అమలులోకి తెచ్చి పేదింటి పెండ్లికి బాసటగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.అంతటితో వదిలి పెట్టకుండా తొలుచురి కాన్పుకు 13 వేలు ఇంటికి పోయేటప్పుడు 3 నెలలకు సరిపడా సామానులు అందించి సురక్షితంగా ఇంటికి చేరుస్తున్న ప్రభుత్వం టి ఆర్ యస్ ప్రభుత్వం అని ఆయన చెప్పుకొచ్చారు.

2014 కు ముందు తరువాత అన్న దానిపై ప్రజల్లో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ను ఆయన ప్రజలకు వివరించారు.ఉచిత విద్యుత్ ,రైతుబందు తో సహ కళ్యాణాలక్ష్మి,బతుకమ్మ చీరలు పంపిణీ రంజాన్,క్రిస్మస్ లకు ఉచితంగా దుస్తులను అందజేసేకార్యక్రమాలు అప్పుడు ఎందుకు అందించ లేక పోయారు ఇప్పుడేలా సాధ్యం అవుతుందని గమనించాలని ఆయన కోరారు.స్వరాష్ట్రంలో సుపరిపాలన అంటే ఇదే అర్థం అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ ఛైర్మన్ పుట్టా కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -