13న అసెంబ్లీ,14న మండలి సమావేశం

174
telangana assembly sessions

ఈ నెల 13, 14 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు జరగనున్నాయి. 13న ఉద‌యం 11:30 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం కానుండగా 14న ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌మండ‌లి ప్రారంభం కానుంది. గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌ మున్సి‌పల్‌ కార్పొ‌రే‌షన్‌ (జీ‌హె‌చ్‌‌ఎంసీ) చట్టాల్లో కొన్ని సవ‌ర‌ణల బిల్లుకు, హైకోర్టు సూచిం‌ంచిన మరి‌కొన్ని అంశా‌ల్లోనూ చట్టాలు చేయాల్సి ఉండటంతో అసెంబ్లీ,మండలి సమావేశం జరగనుంది.

గత నెల 16న శాస‌న‌సభ, మండలి సమా‌వే‌శా‌లను కరోనా నేపథ్యంలో వాయిదా వేసింది ప్రభుత్వం. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి స్పీకర్‌, మండలి చైర్మ‌న్‌లు సమా‌వే‌శా‌లపై నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేయనున్నారు.