పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి అల్లోల

29

నిర్మల్ పట్టణం శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ,నగర సుందరీకరణ పనులను శుక్రవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ ముషారఫ్, అదనపు కలెక్టర్ హేమంత్,చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ లతో కలిసి సందర్శించారు. పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుండి ఎన్టీఆర్ మిని స్టేడియం రోడ్డు వరకు ఆయన పాదయాత్రను చేసి పనులను దగ్గరుండి పరిశిలించారు.

ఫుట్ ఫాత్, రహదారి విస్తరణ, రెలింగ్,రూరల్ పొలీస్ స్టేషన్ దగ్గర నిర్మిస్తున్న ప్రహరీ రోడ్డు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు..ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి రాంకిషన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, TRS నాయకులు తదితరులు పాల్గొన్నారు..