కేంద్రం వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి- మంత్రి

75
- Advertisement -

తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్లు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన ప్రతులను మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ సత్యనారాయణకు అందజేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ఫుడ్ కార్పెరేషన్ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ కేంద్రం ఆధీనంలోనే ఉందని అన్నారు.గోడౌన్ల సంరక్షణ FCI కంట్రోల్ లోనిదేనని దేశంలో ఏ ఒక్క ధాన్యాన్ని కొనాలన్న, ఇతర దేశాల నుండి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్న FCI పరిధిలోనే ఉంటదని FCI అంటే నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అలాంటిది మన రాష్ట్రంలో పండించిన దాన్యాన్ని కేంద్రం కొనక పోవడం తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ కక్ష పూరిత వైఖరికి ఇది నిదర్శనం అని అన్నారు. పంజాబ్‌లో రెండు పంటలు కొంటున్న కేంద్రం తెలంగాణలో వడ్లు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న 700 మంది రైతులను కేంద్రం పొట్టన పెట్టుకుందని విమర్శించారు. కేంద్రం వరుసగా పెట్రోల్ డీజిల్ గ్యాస్, టోల్ ప్లాజా ల ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకార ధోరణిలో సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచామని రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి పరిచి నిర్మల్ పట్టణానికి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. మండువేసవిలో నిర్మల్ పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా 42 కోట్ల నిధులతో ఐదు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి ఇంటింటికి తాగునీటిని అందిస్తున్నామని అన్నారు. గతంలో తాగునీటి కోసం ప్రతి చోటా నిరసన కార్యక్రమాలు ఉండేవని మంత్రులు ,ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఖాళీ బిందెలతో నిరసన చేసేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. రూ.1 కే నల్లా కనెక్షన్ అందిస్తున్నామన్నారు పట్టణ అభివృద్ధికి టియుఎఫ్ఐడిసి ద్వారా రూ 23 కోట్ల నిధులు వచ్చాయని వాటిని ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ఈ నిధులతో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతుమన్నారు. సమీకృత మార్కెట్ న్యూ త్వరలోనే పనులు ప్రారంభించుకొనున్నామన్నారు. రూ 5 కోట్లతో ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ట్యాంక్ బండ్ వద్ద గల జాతీయ జెండా చుట్టూ బ్యూటిఫికేషన్ పనులకు భూమి పూజ చేశామని మంత్రి గుర్తు చేశారు. జిల్లాలో 35 కోట్ల నిధులతో సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. హరితహారం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటును అందించాలని అన్నారు. జూన్ నెలలో నిర్మల్ కలెక్టరేట్ భవనం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -