ఆడబిడ్డల పెద్దన్న సీఎం కేసీఆర్‌: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

295
bathukamma sarees
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆడపడుచులంతా బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

మహిళలందరికి పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరలను ఇస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండి, తెలుపురంగు రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చీరలు అందిస్తున్నామని చెప్పారు.

సుమారు రూ.317 కోట్ల వ్య‌యంతో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలను ప్ర‌భుత్వం పంపిణీ చేస్తున్న‌ద‌న్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరలు అందిస్తున్నామ‌ని, దీనికోసం 287కుపైగా డిజైన్ల చీరలు అందుబాటులో ఉంచామని తెలిపారు.

- Advertisement -