పాశ్వాన్ పార్దివదేహానికి ప్రధాని మోది నివాళి..

119
modi
- Advertisement -

కేంద్ర ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌ అనారోగ్యంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లిన ప్ర‌ధాని.. పాశ్వాన్ పార్దీవ‌దేహంపై పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పాశ్వాన్ మృతిపట్ల వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దేశం గొప్పనేతను కొల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. బీహార్‌కు చెందిన పాశ్వాన్‌ ద‌ళిత నేత‌గా గుర్తింపు పొందారు. లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీని స్థాపించిన ఆయ‌న‌.. ఎనిమిది సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.

1969లో తొలిసారి ఆయ‌న సంయుక్త సోష‌లిస్టు పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యారు. హ‌జీపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న రికార్డు స్థాయిలో గెలుపొందారు. జ‌న‌తాద‌ళ్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌భుత్వాల్లో ఆయ‌న కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

- Advertisement -