నిర్మల్ పట్టణంలోని డాక్టర్ లెన్, కలెక్టరేట్, ఎమ్మార్వో కార్యలయం వద్ద నూతనంగా నిర్మించిన మూడు పబ్లిక్ టాయిలెట్స్ లను శనివారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛ తెలంగాణ, పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆధ్వర్యంలో పబ్లిక్ టాయిలెట్స్ లను నిర్మిస్తున్నామని మొదటి విడతగా ఈరోజు 3 పబ్లిక్ టాయిలెట్స్ లను ప్రారంభించామని తెలిపారు.
ఇతర ప్రాంతాల నుండి నిర్మల్‌కు వచ్చే ప్రయాణికులకు, పట్టణంలోని వారికి ఈ పబ్లిక్ టాయిలెట్స్ ద్వారా సౌకర్య వంతగా ఉంటుందని తద్వారా నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా వుంచుకోవచ్చన్నారు. పట్టణ రద్దీకనుగుణంగా నిర్మల్ పట్టణంలో 20 నుండి 30 పబ్లిక్ టాయిలెట్స్ ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.