పిల్లలకు ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రం ప్రారంభించిన మంత్రి..

83
Minister Satyavathi Rathod

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అనేకమంది తల్లిదండ్రులు దాని బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి పిల్లలను సంరక్షించేందుకు, కోవిడ్ కోసం ప్రత్యేకమైన చికిత్స అందించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లోని శిశు విహార్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, అధికారులు తదితరులు ఉన్నారు.

ఈ సందర్రభంగా మంత్రి మాట్లాడుతూ..ఇక్కడ పిల్లల చికిత్సకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. కొవిడ్ మహమ్మారి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో మహిళా- శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు విహార్‌లో పిల్లల ఆరోగ్య పరిస్థితులను, కొవిడ్ నివారణ, చికిత్స కోసం కల్పిస్తున్న సౌకర్యాలను మంత్రి పర్యవేక్షించారు. శిశు విహార్‌లోని వార్డులను ఒక్కొక్కటిగా తిరుగుతూ అక్కడ ఉన్న పరిస్థితులను సమీక్షించారు. పిల్లలకు కొవిడ్ సందర్భంగా ఇస్తున్న ఆహారాన్ని, స్టాక్ రూమ్ ను కిచెన్ లోకి మంత్రి స్వయంగా వెళ్లి అక్కడి వంటకాలను పరిశీలించారు.

కొవిడ్ బారిన పడ్డ పిల్లలను వెంటనే చేరుకొని వారికి సకాలంలో మెరుగైన చికిత్స అందించేందుకు వాటిని దగ్గర్లోని హాస్పిటల్స్, శిశు కేంద్రాలకు తరలించేందుకు వీలుగా అన్ని జిల్లాలలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొవిడ్ బారినపడి ఒంటరి అవుతున్న చిన్నపిల్లలను పరిరక్షించేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్ కు వెళ్లి అక్కడికి వస్తున్న కేసులను పరిశీలించారు.