‘హైవే’తో వస్తున్న ఆనంద్ దేవరకొండ..

60
Anand Devarakonda

టాలీవుడ్‌ హీరో ఆనంద్ దేవరకొండ ఇటీవలే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో. తాజాగా మరో ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఆ సినిమా పేరే .. ‘హైవే’ (ఏ నర్వ్‌ వ్రాకింగ్‌ రైడ్‌ స్టోరి). క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాకి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసిన ‘గుహన్’ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

శ్రీఐశ్వర్యలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆనంద్ దేవరకొండపై ఎమ్మెల్యే జి. కిషోర్ కుమార్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వీరభద్రం ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. తెలుగులో ‘118’ సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టిన గుహన్ .. ఆ తరువాత చేస్తున్న సినిమా ఇది. కరోనా ఉద్ధృతి తగ్గిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె. కింగ్‌, నిర్మాత: వెంకట్‌ తలారి, కథ, స్ర్కీన్‌ ప్లే, ఫొటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌.