మంత్రి హరీష్‌కు కరోనా పాజిటివ్..

92
harishrao

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన హరీష్…కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్నానని పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని..ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,38,395కి చేరగా లక్షా 5 వేల మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులుండగా 877 మంది కరోనాతో మృతిచెందారు.