దేశంలో 40 లక్షలు దాటిన కరోనా కేసులు..

158
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలు దాటాయి. గత 24 గంట‌ల్లో 86,432 కరోనా కేసులు నమోదుకాగా 1089 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు దేశంలో 40,23,179 కేసులు నమోదుకాగా 69,561 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 8,46,395 యాక్టివ్ కేసులుండగా 31,07,223 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధికంగా మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఢిల్లీ, ఏపీల్లో మ‌ర‌ణాలు సంభవించినట్లు వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది.

గత 24 గంటల్లో 10,59,346 కరోనా టెస్టులు చేయగా సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు 4,77,38,491 మంది క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.