ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం: మంత్రి సబితారెడ్డి

121
Minister Sabitha Indra Reddy

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సబితా రెడ్డి. విద్యా‌ర్థుల భ‌విష్య‌త్తు కోసం పాటుప‌డుతున్న ఉపాధ్యాయుల సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మని అన్నారు.

స‌మాజ అవ‌స‌రాల‌క‌నుగుణంగా విద్యార్థుల‌ను ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నార‌ని, వారి సేవ‌లు మరువ‌లేనిమ‌ని అన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఉప్యాధ్యాయుల సేవ‌లు అనిర్వ‌చ‌నీయ‌మ‌ని చెప్పారు.

ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా 48 మంది టీచ‌ర్ల‌కు పుర‌స్కారాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందులో 12 మంది ప్ర‌ధానోపాధ్యాయులు, 36 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మాజీ రాష్ట్ర‌పతి ప్రణ‌బ్‌‌ము‌ఖర్జీ మరణంతో ఈ నెల 6 వ‌ర‌కు సంతా‌ప‌ది‌నాలు ఉండ‌టంతో ఇవాళ ఉపాధ్యాయ దినోత్స‌వం జ‌ర‌ప‌డం లేద‌ని విద్యాశాఖ ప్ర‌క‌టించింది.